Santosh Shoban: ప్రభాస్‌కు ఈ సినిమా చూపించాలన్నదే నా డ్రీమ్‌..

3 Nov, 2022 18:56 IST|Sakshi

యంగ్‌ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్‌'. నిహారిక ఎంటర్ టైన్‌మెంట్‌, ఆముక్త క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరో సంతోష్ శోభన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. 

► లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్‌ కథ చాలా నచ్చింది. అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీ గారు అంటే ఇష్టం. ఆయన ఇచ్చిన కథతో ఏక్ మినీ కథ చేశాను. ఈ సినిమా తర్వాత మళ్ళీ వర్క్ చేయాలనుకున్నాం. లక్కీగా తొందరగా అయిపొయింది. కథ చెప్పిన నెల రోజుల తర్వాతే షూటింగ్ కి వెళ్ళిపోయాం. ఆయన కూడా నన్ను నమ్మారు. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది.

► ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఛాయిస్ అని  మేర్లపాక గాంధీ గారు చెప్పారు. ఆయన మాట నమ్ముతున్నాను(నవ్వుతూ). ఇందులో యూట్యూబర్ విప్లవ్ పాత్ర నాకు చాలా హై ఇచ్చింది. కెరీర్ లో మొదటిసారి నా ఏజ్ పాత్రలో చేస్తున్నా. ఎక్స్ ప్రెస్ రాజాలా హైపర్ ఎనర్జిటిక్ క్యారెక్టర్. చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. దర్శకుడు గాంధీ డైలాగ్‌ను పర్ఫెక్ట్ గా రాస్తారు. ఆయన రాసింది ఆయనలా చెబితేనే కుదురుతుంది.

► నిజానికి సోషల్ మీడియాలో నేను కొంచెం వెనకబడి వున్నాను. యూట్యూబ్ అందరికీ తెలుసు. మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూటింగ్ చేసినప్పుడు అక్కడ యూట్యూబ్ వ్లాగ్ చేసే కుర్రాళ్ళు వున్నారు. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్‌ మాకంటే బాగా చెప్తున్నారు. మనం ఎక్కడో వెదుకుతాం కానీ మన చుట్టూనే బోలెడు ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.

► నటుడు బ్రహ్మజీ గారితో చాలా ఫన్ ఉంటుంది. అదే సమయంలో ఒక సీన్ చేస్తున్నపుడు ఎలా చేయాలో చర్చిస్తుంటారు. సిందూరం నుండి ఇప్పటివరకూ ఆయనలో అదే ఫైర్, ప్యాషన్ ఉన్నాయి. ఆయన నుంచి కొత్త నటులు చాలా నేర్చుకోవాలి. ఫరియా చాలా ఎనర్జిటిక్. తను ఒక సూపర్ డూపర్ హిట్ తర్వాత చేసిన సినిమా ఇది. కథని నమ్మి చేసింది. ఫరియా నుంచి చాలా నేర్చుకున్నాను. 

► ప్రభాస్ గారు ఇండియా బిగ్గెస్ట్ స్టార్. ఆయన్ని ఎప్పుడు కలిసినా అభిమానిగానే కలిశా. కలిసినప్పుడల్లా చాలా హ్యాపీ. లైఫ్ లాంగ్ ఆయన్ని అలా అభిమానిగా కలిసినా చాలు. మేము ఎప్పుడు కలిసినా ఆయనకున్న సమయం ప్రకారం టీజర్, ట్రైలర్, సాంగ్ ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. ఇది ఆయన గొప్పదనం. ఆయనకి సమయం కుదిరితే ఈ సినిమా చూపించాలన్నదే నా డ్రీమ్. 

► డిసెంబర్ 21న నందిని రెడ్డి గారి సినిమా 'అన్ని మంచి శకునములే' వస్తోంది. అలాగే యూవీ క్రియేషన్స్‌లో 'కళ్యాణం కమనీయం' ఉంది. సమయం కుదిరితే ఓటీటీలకు కూడా చేయాలని ఉంది. నాకు యాక్షన్ కామెడీలు ఎక్కువ ఇష్టం.

చదవండి: బిగ్‌బాస్‌: ఆర్జే సూర్యపై ఇనయ ప్రేమ సక్సెస్‌ అయ్యేనా?
జిన్నా హిందీ డబ్బింగ్‌కు అన్ని కోట్లా?

మరిన్ని వార్తలు