ఏక్‌ మినీ కథ: సామిరంగా సాంగ్‌ రిలీజ్‌

22 Apr, 2021 06:22 IST|Sakshi

‘పేపర్‌ బాయ్‌’ సినిమా ఫేమ్‌ సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. కార్తీక్‌ రాపోలు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ అనుబంధ సంస్థ అయిన యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్‌ మీడియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రమిది. కావ్యా థాపర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ‘సామిరంగా..’ అంటూ సాగే పాట విడుదల చేశారు.

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ రాజా’ లాంటి  చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించారు. ‘‘ఈ మధ్యే విడుదలైన ‘ఈ మాయలో..’ లిరికల్‌ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన ‘సామిరంగా..’ అతి కొద్ది సమయంలోనే సోషల్‌ మీడియాలో విశేష స్పందన అందుకుంటూ చాట్‌ బస్టర్‌గా మారింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు.

చదవండి: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ.. ఫొటోలు, ఫ్లెక్సీలతో హల్‌చల్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు