'ఏక్ మినీ కథ' హీరోకు ఛాన్స్‌ ఇచ్చిన సుష్మిత కొణిదెల!

21 Jun, 2021 13:37 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత  కొన్ని రోజుల క్రితం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ బ్యానర్‌లో ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ అనే వెబ్‌ సిరీస్‌ను కూడా నిర్మించింది. ఇప్పుడు ఓ సినిమాను ప్రొడ్యూస్‌ చేయనుంది. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన  ‘8 తూట్టాక్కళ్‌’ (8బుల్లెట్లు) అనే సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని భావిస్తుందట.

ఇప్పటికే మూవీ రీమేక్‌ హక్కులను కూడా కొన్నారట. గణేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో  సంతోష్‌ శోభన్‌ను హీరోగా ఫైనల్‌ చేయారట. 'ఏక్ మినీ కథ' సినిమాతో క్రేజ్‌ సంపాదించుకున్న సంతోష్‌ శోభన్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఆయనకు పలు  సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా నందిని రెడ్డి సినిమాలో ఛాన్స్‌ కొట్టేసినట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు సమాచారం. 

చదవండి : నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్‌ శివన్‌
మరో బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమంత

మరిన్ని వార్తలు