ఒక చిన్న కథ

22 May, 2021 00:51 IST|Sakshi

‘పేపర్‌ బాయ్‌’ సినిమా ఫేమ్‌ సంతోష్‌ శోభన్, కావ్యా తప్పర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించడం విశేషం. హీరో ప్రభాస్‌ ఈ సినిమా ట్రైలర్‌ని తన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా షేర్‌ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ– ‘‘శోభన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘వర్షం’ చిత్రం నా కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇలాంటి విజయాన్ని అందించిన శోభన్‌గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

శోభన్‌ తనయుడు సంతోష్‌ నటించిన ‘ఏక్‌ మినీ కథ’ విడుదలవుతున్న సందర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేష¯Œ ్స నిర్మాతలకు, ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్‌ మీడియా నిర్మించిన ‘ఏక్‌ మినీ కథ’ ఈ నెల 27 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రవర్గాలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ అండ్‌ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. మా సినిమా ట్రైలర్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో కమెడియన్‌ సుదర్శన్‌ పంచ్‌ డైలాగ్‌లు, సంతోష్‌ శోభన్‌ పలికించిన హావభావాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు