Sapta Sagaradaache Ello OTT Release: థియేటర్స్‌లో ఉండగానే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్‌ సినిమా

29 Sep, 2023 07:18 IST|Sakshi

కంటెంట్‌ బాగుంటే చాలు ఇతర పరిశ్రమలకు చెందిన సినిమాలనూ ఆదరించడంలో ముందుంటారు తెలుగు ప్రేక్షకులు. అలా ఇప్పటికే ఇతర ఇండస్ట్రీకి చెందిన ఎందరో హీరోలను తెలుగువారు ఆదరిస్తున్నారు. అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లి సినిమాలతో కన్నడ హీరో రక్షిత్‌ ఇప్పటికే తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన  ‘సప్తసాగరాలు దాటి: సైడ్‌ ఏ’ సెప్టెంబర్‌ 22న తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.  ఈ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది.

(ఇదీ చదవండి: (Salaar Release Date: ప్రభాస్‌ సలార్‌ విడుదలపై అఫిషీయల్‌ ప్రకటన వచ్చేసింది)

ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ సినిమాను ఓటీటీలో విడదల చేయడంతో ఫ్యాన్స్‌  థ్రిల్‌కు గురౌతున్నారు. కథ నెమ్మదిగా సాగిన ఇదోక అద్భుతమైన ప్రేమ కథ అని మంచి టాక్‌ వచ్చింది. స‌ప్త సాగ‌రాలు దాటిన ఈ ప్రేమకథ అందరినీ క‌దిలించిందని ఎందరో పాజిటివ్‌ రివ్యూస్‌ కూడా ఇచ్చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం క‌థతో పాటు అందులోని నటీనటుల భావోద్వేగాలు అని సినీ ప్రేమికులు తెలిపారు. ప్రేమ‌లో ప‌డిన  ఓ జంట ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. అంద‌మైన క‌ల‌లు క‌న్న ఆ జంట ప్ర‌యాణాన్ని విధి ఎలా ప్ర‌భావితం చేసింది? అనేదే కథాంశం. థియేటర్లో చూడలేకపోయిన వారు ఈ వారం  స‌ప్త సాగ‌రాలు దాటి చిత్రాన్ని చూసి ఎంజాయ్‌ చేయండి.

కన్నడలో  ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్‌ ఏ’ కి ఈ చిత్రం అనువాదం. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి టాక్‌ వచ్చినా.. థియేటర్స్‌ సమస్య ఎదురైంది. దీంతో వారు వెంటనే ఓటీటీలోకి విడుదల చేసినట్లు సమాచారం. ఇందులో హీరోయిన్‌ రుక్మిణీ వసంత్ నటన మరో రేంజ్‌లో ఉంటుందని ఆమెను పలువురు అభినందించారు. ఇంతటి సూపర్‌ హిట్‌ కొట్టిన సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌లో చూసేయండి.

ఈ సినిమాను సీక్వెల్ కూడా త్వరలో రాబోతోంది. పార్ట్ వ‌న్‌ను 'సప్తసాగరాలు దాటి: సైడ్ ఏ'గా రిలీజ్ చేశారు. సీక్వెల్‌ 'సప్తసాగరాలు దాటి: సైడ్ బీ' అక్టోబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ)

మరిన్ని వార్తలు