సప్తగిరి ‘గూడుపుఠాణి’ మూవీ మోషన్‌ పోస్టర్‌ విడుదల

5 Jul, 2021 08:10 IST|Sakshi

సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన ‘గూడుపుఠాణి’ చిత్రం టైటిల్‌ని సప్తగిరి హీరోగా నటించిన తాజా చిత్రానికి ఫిక్స్‌ చేశారు. కుమార్‌ కె.ఎం. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్‌గా నటించారు. ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై పరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి, కటారి రమేష్‌ నిర్మించిన ఈ చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ని కృష్ణ విడుదల చేశారు.  ‘‘కృష్ణగారు మా సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేయడం హ్యాపీ’’ అన్నారు సప్తగిరి. ‘‘గూడుపుఠాణి’ సినిమాకి దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగుంది’’ అన్నారు పరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి, కటారి రమేష్‌. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు’’ అన్నారు కుమార్‌ కె.ఎం. ఈ చిత్రానికి ప్రతాప్‌ విద్య సంగీతం అందిస్తున్నాడు.

మరిన్ని వార్తలు