అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను ప్రేమిస్తున్న హీరోయిన్‌!

2 Jul, 2021 08:19 IST|Sakshi

'కేదార్‌నాథ్‌' సినిమాతో వెండితెరపై కెరీర్‌ను ఆరంభించింది బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌. ఈ సినిమాలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో సుశాంత్‌, సారా డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి, కానీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. తర్వాత ఆమె యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌తో ప్రేమాయణం జరుపుతున్నట్లు టాక్‌ నడిచింది. వీళ్లిద్దరిదీ విడదీయరాని అనుబంధం అంటూ కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే తాజాగా సారా మరో వ్యక్తితో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. 'కేదార్‌నాథ్‌' అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జెహన్‌ హండాతో ఆమె ప్రేమలో పడిందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ ఊహాగానాలకు మరింత బలన్నా చేకూరుస్తూ.. సముద్ర తీరాన జెహన్‌ హండాతో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను సారా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా "లవ్‌ యూ.. నన్ను మళ్లీ అక్కడకు తీసుకెళ్లిపో" అని రాసుకొచ్చింది. ఈ ఫొటోలో వీళ్లిద్దరూ నారింజ రంగు దుస్తులను ధరించగా సారా అతడిపై వాలిపోవడం చూడొచ్చు. ఇదిలా వుంటే గతేడాది జెహన్‌.. సారా పుట్టినరోజు చేసిన పోస్ట్‌​ కూడా అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. 'మన స్నేహం, ప్రేమ, జ్ఞాపకాలను మార్చడం ఎవరి తరమూ కాదు, నేనెప్పటికీ నీతో ఉంటానని మాటిస్తున్నా'నని చెప్పుకొచ్చాడు.

చదవండి: ఈ స్టార్‌ కిడ్‌ ఎవరో గుర్తు పట్టారా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు