సుశాంత్ ఫామ్‌హౌస్‌లో తరచూ పార్టీలు

16 Sep, 2020 09:10 IST|Sakshi

ముంబై: సారా అలీ ఖాన్, రియా చక్రవర్తి తరచుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫామ్‌హౌస్‌ లోనావాలాకు వస్తుండేవారని, ఫామ్‌హౌస్‌ మేనేజర్‌ రీస్‌ ఒక న్యూస్‌ ఏజెన్సీ జరిపిన ఇన్వెస్టిగేషన్‌లో తెలిపారు. రియా చక్రవర్తి, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ వంటి బాలీవుడ్ మిత్రులు సుశాంత్‌తో కలిసి ఫామ్‌హౌస్‌లోనే పార్టీలు చేసుకునేవారని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరోకు సుశాంత్‌ వద్ద పనిచేసే జగదీష్‌ అనే వ్యక్తి తెలిపారు. డ్రగ్-పెడ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న జైద్ విలాత్రా తదితరులు పార్టీ చేసుకున్న వారిలో ఉన్నారని వెల్లడించారు.  

సుశాంత్‌ పార్టీలలో గంజా, మద్యం సర్వసాధారణమని ఫామ్‌హౌస్‌ మేనేజర్‌ రీస్‌ వ్యాఖ్యానించారు. దీంతో లోనవాలా ఫామ్‌హౌస్‌ డ్రగ్‌ కేసుకు సంబంధించి ప్రధాన అంశంగా మారింది. ఎన్‌సీబీ ప్రస్తుతం దీనిపై దృష్టి సారించింది. సెప్టెంబర్ 2018 నుంచి సుశాంత్‌ ఫామ్‌హౌస్‌లో రీస్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సారా ఆలీఖాన్‌, రియా చక్రవర్తి తరచూ ఆ ఫామ్‌ హౌస్‌ను సందర్శిస్తూ ఉండేవారని ఆయన తెలిపారు. పార్టీల కోసం వారు స్మోక్‌ పేపర్లను కూడా ఆర్డర్‌ చేసేవారని, అయితే వాటిని ఎందుకు ఉపయోగించేవారో తనకు తెలియదని  రీస్‌ పేర్కొన్నారు. 

లాక్‌డౌన్‌కు ముందు వారానికి ఒకటి, రెండుసార్లు రాజ్‌పుత్‌ ఈ ఫామ్‌హౌస్‌కు వచ్చేవారని రీస్‌ తెలిపారు. అతనితో పాటు ఎవరు ఉంటారు అని రిపోర్టర్‌ ప్రశ్నించగా, మొదట్లో సారా అలీఖాన్‌ వచ్చేవారు. అప్పుడు రియా కూడా వారితో కలిసి వచ్చేది అని చెప్పారు. గత ఏడాది జూలైలో రియా తన పుట్టిన రోజు వేడుకలను తల్లిదండ్రులు, తన సోదరుడు షోవిక్‌తో కలిసి ఆ ఫామ్‌ హౌస్‌లో జరుపుకుంది అని రీస్‌ తెలిపారు. పార్టీలలో స్మోక్‌ పేపర్‌ వాడేవారని, ఖరీదైన వోడ్కాను అందించేవారని వెల్లడించారు. లాక్‌డౌన్‌లో ఫామ్‌హౌస్‌లో గడపాలని సుశాంత్‌ కోరుకున్నారని అయితే ఏవో కారణాల వల్ల ఆయన రాలేకపోయాని తెలిపారు.  చదవండి: జయా బచ్చన్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా