అతడి మీద కోపం.. నాపై అరిచేశారు: హీరోయిన్‌

3 Dec, 2020 11:09 IST|Sakshi

ముంబై: వరుణ్‌ ధావన్‌ వల్ల తాను తిట్లు తినాల్సి వచ్చిందన్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌. అతడు చేసిన ఆలస్యం కారణంగా డైరెక్టర్‌ తనపై అరిచారని చెప్పుకొచ్చారు. కాగా  కూలీ నెం.1 సినిమాలో సారా- వరుణ్‌ జంటగా నటించిన సంగతి తెలిసిందే. 1995లో విడుదలైన కూలీ నెం. 1 రీమేక్‌ ఇది. మాతృకకు దర్శకత్వం వహించిన డేవిడ్‌ ధావన్‌ దీనిని తెరకెక్కిస్తున్నారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల చేయనున్నారు. క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబరు 25న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్‌ ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలుపెట్టింది.టీజర్లు, ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలో సారా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ షూటింగ్‌ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పారు. ‘‘మైతో రాస్తే సే పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో డేవిడ్‌ సర్‌కు చాలా కోపం వచ్చింది. నాపై గట్టిగా అరిచేశారు. నిజానికి నేను షూట్‌కు సిద్ధంగానే ఉన్నాను. డిజైనర్‌, కాస్ట్యూమ్‌ సరిచేస్తున్నారు. కానీ అప్పటికి వరుణ్‌ ఇంకా తన వ్యాన్‌లోనే ఉన్నాడు. దీంతో డేవిడ్‌ సర్‌ అప్‌సెట్‌ అయ్యారు. మీ వల్లే షూట్‌ ఆలస్యం అవుతోంది అంటూ చివాట్లు పెట్టారు. వరుణ్‌పై కోపం నాపై చూపించారనిపించింది. అయితే ఆ తర్వాత అంతా సద్దుమణిగింది’’ అని పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ భామలకు క్లీన్‌ చిట్‌?)

తండ్రీకొడుకుల మధ్య విభేదాలు!
కాగా సినిమా విడుదల విషయంలో తండ్రీకొడుకులైన డేవిడ్‌, వరుణ్‌ల మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొన్నిరోజులుగా బీ-టౌన్‌లో టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల ఓటీటీలో కూలీ నెం.1 రిలీజ్‌ చేయాలని డేవిడ్‌ భావించగా, తాను ఓటీటీ యాక్టర్‌ అని పిలుపించుకునేందుకు సిద్ధంగా లేనని, థియేటర్లోనే సినిమా విడుదల చేయాలని వరుణ్‌ పట్టుబట్టినట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే సీనియర్‌ డైరెక్టర్‌ అయిన డేవిడ్‌ మాటను ఆయన కుమారుడు వినక తప్పలేదని, దీంతో అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదలవుతోందని వారి సన్నిహితులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు