జిమ్ డ్రెస్‌లో స్టార్స్‌ మనసు కొల్లగొడుతున్న సారా టెండూల్క‌ర్

22 Sep, 2021 18:12 IST|Sakshi

ఇండియన్‌ క్రికెటర్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కి తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయ సారా టెండూల్కర్‌ సైతం ఫ్యాషన్‌తో అభిమానుల మనసులు కొల్లగొడుతోంది. ఆమె సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ  కొత్త కొత్త ఫోటోలను షేర్‌ చేస్తుంటుంది. 

కాగా ఇటీవల సారా ఓ ఫోటో అప్లోడ్‌ చేయగా, అది వైరల్‌ అయ్యింది. అందులో ఆమె జిమ్‌ డ్రెస్‌ వేసుకోగా, వెనుక డంబుల్స్‌ ఉన్నాయి. ఫ్రెండ్‌ కొత్తగా రూపొందించిన స్పోర్ట్స్‌ వేర్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం ఈ పిక్‌ని అప్లోడ్‌ చేసింది. ఈ పిక్‌కి..   ‘నా స్నేహితురాలు డాల్జీ  ఈ క్రీడ దుస్తులను క్రియేట్‌ చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఇవీ ఎంతో సౌకర్యంగా ఉన్నాయ’ని క్యాప్షన్‌ని జోడించింది. 

సారా ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఈ పోస్ట్‌కి లక్షల్లో లైక్స్‌ వచ్చాయి. కాగా ఈ పోస్ట్‌ని బాలీవుడ్ న‌టులు అర్జున్ క‌పూర్‌, కార్తిక్ ఆర్య‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ సోద‌రి కృష్ణా ష్రాఫ్ కూడా లైక్‌ చేశారు.  దీంతో ఈ పిక్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, భార‌త క్రికెట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌తో 23 ఏళ్ల ఈ బ్యూటీ డేటింగ్ చేస్తున్న‌ట్లు రూమర్స్‌ వినిపిస్తున్న విషయం విదితమే. కానీ ఇప్పటి వరకు ఎవరూ దీనిపై స్పందించలేదు.

A post shared by Sara Tendulkar (@saratendulkar)

మరిన్ని వార్తలు