కండలు పెంచిన సీనియర్‌‌ నటుడు, వైరల్‌

18 Nov, 2020 12:37 IST|Sakshi

సాక్షి , చెన్నై: అద్భుతమైన ఫిట్‌నెస్‌తో  సీనియర్‌ హీరోలు కుర్ర హీరోల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ 63 సంవత్సరాల వయసులో కండలు పెంచి  అటు యంగ్‌ హీరోలను, ఇటు నెటిజన్లను  ఆశర్యపరిస్తే,  తాజాగా తమిళ సూపర్‌ హీరో  శరత్‌కుమార్‌ (66) తన బాడీ బిల్డింగ్‌తో అదర గొట్టేస్తున్నాడు.. 66 ఏళ్ల వయసులో కూడా తన కండలతో  నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాడు. సహజంగానే బాడీ బిల్డర్‌ అయిన శరత్‌ కుమార్‌ లేటెస్ట్‌ జిమ్‌  ఫోటో వైరల్‌ అవుతోంది. (ప్రముఖ నటి ఇంట్లో అపరిచితుడి గలాటా)

కాగా పృథ్వీరాజ్, బిజు మీనన్ నటించిన  మలయాళ సూపర్ హిట్  మూవీ  'అయ్యపనమ్ కోషియం'  తమిళ రీమేక్‌లో  శరత్ కుమార్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్ మూవీలో పృథ్వీరాజ్ పాత్రను శశికుమార్, శరత్ కుమార్ బిజు మీనన్ పాత్రను పోషించనున్నారని అంచనా. మరోవైపు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌​ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

>
మరిన్ని వార్తలు