బార్సిలోనాలో ‘సర్కారు వారి పాట’, మహేశ్‌-కీర్తి మధ్య డ్యూయెట్స్‌

19 Oct, 2021 19:04 IST|Sakshi

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల షూటింగ్‌ నేపథ్యంలో సర్కారు వారి పాట టీం స్పెయిన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌ షెడ్యూల్‌ దుబాయ్‌, సెకండ్‌ షెడ్యుల్‌ను హైదరాబాద్‌, ఇటీవల స్పెయిన్‌లో షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు 70 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సర్కారు వారి పాట టీం స్పెయిన్‌లోని బార్సిలోనాలో షూటింగ్‌ను జరుపుకుంటోదట.

చదవండి: ప్రభాస్‌ బర్త్‌డే హంగామా.. లీకైన ‘సలార్‌’ యాక్షన్‌ సీన్‌ వీడియో

అక్కడి అందమైన లొకేషన్స్‌లో మహేశ్‌, కీర్తి మధ్య పాటలను చిత్రీకరిస్తు‍న్నట్లు తెలుస్తోంది. అంతేగాక వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, లవ్‌ ట్రాక్‌కు సంబంధించిన సీన్స్‌ను కూడా అక్కడ షూట్‌ చేస్తున్నారని సమాచారం. ఈ నెల చివరి వరకు అక్కడ షూటింగ్‌ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌ చివిరి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేస్తారని సమాచారం. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్‌ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

చదవండి: లైవ్‌చాట్‌లో పూజ హెగ్డేకు షాకింగ్‌ ప్రశ్న, నెటిజన్‌కు హీరోయిన్‌ చురక

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు