Mahesh Babu Remuneration: సర్కారువారి పాట కోసం మహేశ్‌బాబు ఎంత తీసుకున్నాడో తెలుసా?

14 May, 2022 14:36 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సినిమా వస్తోందంటేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది మాస్‌ మసాలా మూవీతో వచ్చాడంటే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారు. తాజాగా మహేశ్‌బాబు నటించిన సర్కారువారి పాట థియేటర్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో నటీనటులు ఏ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ తీసుకున్నారన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

డైరెక్టర్‌ పరశురామ్‌ రూ.10 కోట్లు తీసుకోగా మహేశ్‌బాబు రూ.35 - 50 కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్‌ను బట్టి మహేశ్‌ తీసుకునే రెమ్యునరేషన్‌ లెక్కలు కూడా మారతాయట. అయితే ఈ సూపర్‌ స్టార్‌ తను ఎంత డబ్బు తీసుకున్నా దాని సాయంతో  చిన్నారుల కోసం ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తాడని, అలాంటప్పుడు ఆయన ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నా తప్పు లేదంటున్నారు ఫ్యాన్స్‌. ఇక సర్కారువారిపాట సినిమా విషయానికి వస్తే మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్‌ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. తమన్‌ సంగీతం అందించిన ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 

మరిన్ని వార్తలు