నా కల నిజమైంది..అలా మారడం చాలెంజింగ్‌: హీరో ఆర్య

17 Jul, 2021 08:58 IST|Sakshi

అది పెద్ద సవాల్‌ఆర్య హీరోగా ‘కబాలి’ ఫేమ్‌ పా. రంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘సారపట్ట పరంబరై’. ఈ నెల 22 నుంచి ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్న సందర్భంగా ఆర్య మాట్లాడుతూ– ‘‘ఒక స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేయాలనుకుంటున్న నాకు రంజిత్‌ చెప్పిన ‘సారపట్ట పరంబరై’ కథ బాగా నచ్చింది. ఈ కథలో ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ బాక్సింగ్‌ ఉంటుంది. జీవితాలను ప్రతిబింబిస్తుంది.

1975లో మద్రాస్‌లో ఉండే బాక్సింగ్‌ కల్చర్‌ని చూపించాం. బాక్సర్‌గా మారడం ఫిజికల్‌గా పెద్ద చాలెంజింగ్‌గా అనిపించింది. జాతీయ స్థాయి బాక్సర్ల దగ్గర శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘నా మ్యారీడ్‌ లైఫ్‌ బాగుంది. ‘గజినీకాంత్, కాప్పాన్, టెడ్డీ’ చిత్రాల్లో సాయేషా (హీరోయిన్, ఆర్య భార్య), నేను కలిసి నటించాం. మంచి కథ దొరికితే మళ్లీ నటిస్తాం. తెలుగులో ‘వరుడు’, ‘సైజ్‌ జీరో’ చిత్రాల తర్వాత మరో సినిమా చేయాలని నాకూ ఉంది. మంచి స్క్రిప్ట్‌ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు