నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

13 Sep, 2020 06:55 IST|Sakshi
గోవింద్‌రాజ్

గోవింద్‌రాజ్, కిరణ్‌ మేడసాని, త్రిశంక్, అభిషేక్, లావణ్య, ఫరీనా, రవళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ అన్నది ట్యాగ్‌లైన్‌ . అతిమళ్ల రాబిన్‌  నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి. వెంకట్‌ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేసి, సినిమా పెద్ద హిట్‌ కావాలని శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘తన ఆలోచనే కరెక్ట్‌ అని భావించి తాను తీసే సినిమా యూనిట్‌ను ముప్పతిప్పులు పెట్టే ఓ డైరెక్టర్‌ చివరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథని వినోదాత్మకంగా తెరకెక్కించాం. ప్రధాన పాత్రలో గోవింద్‌ రాజ్‌ నటించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్‌.జి, కెమెరా: బొబ్బిలి సంతోష్‌ రెడ్డి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు