Sasivadane Movie: లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘శశివదనే’.. ఆకట్టుకుంటోన్న ప్రోమో

27 Jan, 2023 21:38 IST|Sakshi

యువ కథానాయకుడు ర‌క్షిత్ అట్లూరి, కోమ‌లి ప్ర‌సాద్ జంటగా నటిస్తున్న  చిత్రం ‘శశివదనే’. గౌరి నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌వీఎస్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్, ఎజీ ఫిల్మ్ కంపెనీ ప‌తాకాల‌పై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సాయి మోహ‌న్ ఉబ్బ‌న ద‌ర్శ‌క‌త్వంలో అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో ప్ర‌వీణ్ యండ‌మూరి, త‌మిళ న‌టుడు శ్రీమాన్‌, క‌న్న‌డ న‌టుడు దీప‌క్ ప్రిన్స్‌, జ‌బ‌ర్ద‌స్త్ బాబీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. 

 ప్రోమోను గమనిస్తే పక్కా లవ్‌ ఎంటర్‌టైనర్‌గా అర్థమవుతోంది. ఈ ప్రోమో చాలా నేచుర‌ల్‌గా, క‌ల‌ర్‌ఫుల్‌గా ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటోంది. హ‌రి చ‌ర‌ణ్, చిన్మ‌యి శ్రీపాద పాడిన పాట‌ సినిమాలో అల‌రించ‌నుంది. శ్ర‌వ‌ణ వాసుదేవ‌న్ సంగీతం అందించారు. కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యం ట్యూన్‌కు త‌గ్గ‌ట్లు అందంగా  ఉన్నాయి. శ‌శివ‌ద‌నే పూర్తి టైటిల్ సాంగ్‌ను మేక‌ర్స్ ఫిబ్ర‌వ‌రి 1న రిలీజ్ చేస్తున్నారు. కాగా.. కోన‌సీమ‌, అమ‌లాపురం త‌దిత‌ర ప్రాంతాల్లో 50 రోజుల‌కు పైగానే ఈ సినిమాను చిత్రీక‌రించారు.

మరిన్ని వార్తలు