సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'తిమ్మరుసు'..రిలీజ్‌ ఎప్పుడంటే..

24 Jul, 2021 20:50 IST|Sakshi

’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో హీరోగా మారిన సత్యదేవ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. తాజాగా సత్యదేవ్‌ హీరోగా 'తిమ్మరుసు’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ట్యాగ్‌లైన్‌. తిమ్మరుసు లాంటి తెలివితేటలున్న లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌  కనిపించనున్నారు. 'టాక్సీవాలా' చిత్రంతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న ప్రియాంకా జవాల్కర్‌ ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా నటించింది.

శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మించారు.  ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్‌ పడింది. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 30న థియేటర్స్‌లో విడుదల కానుంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. 
 

మరిన్ని వార్తలు