60 ఏళ్ల మహిళకు..20 ఏళ్ల కుర్రాడితో పెళ్లి

12 Jul, 2021 01:13 IST|Sakshi

హాస్యనటిగా ఎన్నో పాత్రల్లో ప్రేక్షకులను నవ్వించిన శ్రీలక్ష్మి టైటిల్‌ రోల్‌ చేసిన తాజా చిత్రం ‘సావిత్రి వైఫ్‌ ఆఫ్‌ సత్యమూర్తి’. ‘కేరింత’లో నూకరాజు పాత్రలో ఆకట్టుకున్న పార్వతీశం హీరో. అరవయ్యేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. గోగుల నరేంద్ర నిర్మించిన ఈ సినిమా ద్వారా పూరి జగన్నాథ్‌ శిష్యుడు చైతన్య కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఆగస్టు మూడో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. గోగుల నరేంద్ర మాట్లాడుతూ– ‘‘కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రమిది. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి జంట నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాతో ముగ్గురు కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య కశ్యప్, కెమెరా: ఆనంద్‌ డోల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు