Amitabh Bachchan: ఓటీటీకి ‘జుండ్‌’.. తెలంగాణ హైకోర్టు స్టేపై సుప్రీం కోర్టు స్పందన

5 May, 2022 14:34 IST|Sakshi

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ తాజా చిత్రం జుండ్‌ మే 6న ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 4న ఈ సినిమా థియేటర్లో విడుదలైంది. అయితే ఈ మూవీ ఓటీటీ విడుదలను ఆపాలంటూ తెలుగు నిర్మాత తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అతడి పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఈ మూవీ డిజిటల్‌ రిలీజ్‌పై స్టే విధించింది.

చదవండి: సినిమాలకు హీరోయిన్‌ కాజల్‌ గుడ్‌బై చెప్పనుందా?

హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసం ఇవాళ విచారణకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ స్టేపై పూర్తి వివరణ ఇవ్వలేదని, కేవలం ఒక లైన్‌ స్టెట్‌మెంట్‌ మాత్రమే ఇచ్చిందని సీనియర్‌ లాయర్‌ సీఏ సుందరం అన్నారు. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూన్‌ 9కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

చదవండి: ఉత్కంఠగా సమంత ‘యశోద’ మూవీ ఫస్ట్‌గ్లిం‍ప్స్‌

కాగా హైదరాబాద్‌కు చెందిన నిర్మాత నంది కుమార్‌ ఏప్రిల్‌ 29న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పటిషన్‌ దాఖలు చేశాడు. జుండ్‌ మూవీ నిర్మాతలు కాపీ రైట్‌ నిబంధనలను ఉల్లఘించారని నంది కుమార్‌ తన పిటిషన్‌లో ఆరోపించాడు. కాగా నాగ్​పూర్​కు చెందిన ప్రముఖ ఫుట్​బాల్​ కోచ్​ విజయ్​ బార్సే జీవితం ఆధారంగా డైరెక్టర్‌ నాగరాజ్‌ మంజులే ఈ​ సినిమాను తెరకెక్కించాడు. అంకుశ్‌, ఆకాష్‌, రింకు సహా తదితరులు ఈ చిత్రంలో నటించారు. 

మరిన్ని వార్తలు