స్కామ్ 1992కు అరుదైన గౌరవం

7 Jun, 2021 16:53 IST|Sakshi

ఇండియన్​ వెబ్​ సిరీస్​ ‘స్కామ్ 1992’ అరుదైన గౌరవం దక్కించుకుంది. హర్షద్ మెహతా బయోపిక్​గా తెరకెక్కిన ఈ వెబ్​ సిరీస్​ ఐఎండీబీ ఆల్​టైం ఫేవరెట్ వెబ్ సిరీస్​లలో నెంబర్ వన్​​ పొజిషన్​లో నిలిచింది. ఈ అరుదైన ఫీట్​పై సోనీ ఎల్​ఐవీ సిరీస్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

మొత్తం 163 సిరీస్​లు పోటీపడగా.. ఇండియా నుంచి కేవలం స్కామ్ 1992 మాత్రమే ఈ లిస్ట్​లో నిలిచింది. ఓట్ల లెక్కింపుతో స్కామ్ 1992కి అగ్రస్థానం దక్కింది. హన్షల్ మెహతా డైరెక్ట్​ చేసిన ‘స్కాం 1992: హర్షద్​ మెహతా స్టోరీ’ ప్రపంచంలో మోస్ట్​ వాచ్​డ్​ సిరీస్​గానూ గుర్తింపు దక్కించుకుంది.

గుజరాతీ నటుడు ప్రతీక్​ గాంధీ లీడ్​ రోల్ చేసిన ఈ వెబ్ సిరీస్.. రింగ్ టోన్​ ద్వారానూ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఓటింగ్​ పర్సంటేజ్​ ద్వారా స్కాం 1992కి టాప్ పొజిషన్​ రావడం గొప్ప విషయం కాదనేది కొందరి మాట. ఆ లెక్కన తర్వాతి ప్లేసులో నిలిచిన నెట్​ఫ్లిక్స్​ బ్రేకింగ్ బ్యాడ్​ సిసలైన విన్నర్​ అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు