మూవీ టైటిల్‌ విని అల్లు అర్జున్‌ షాక్‌ అయ్యాడు: డైరెక్టర్‌ రత్నబాబు

24 May, 2021 16:27 IST|Sakshi

తన కోసం సిద్దం చేసిన మూవీ టైటిల్‌ చెప్పగానే బన్ని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు రచయిత డైమండ్‌ రత్నబాబు గుర్తు చేసుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు తాజా చిత్రం సన్‌ ఆఫ్‌ ఇండియా మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రత్నబాబు మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ కోసం ఆయన రాసిన స్క్రిప్ట్‌ గురించి వివరించారు. 

‘ఒక రోజు బన్ని వాసు ద్వారా అల్లు అర్జున్‌ను కలిశాను. ఆయన కోసం కథ రాశానని చెప్పగానే టైటిల్‌ ఏంటని అడిగారు. వెంటనే నేను గాలిగాడు అని చెప్పాను. అది విన్న బన్ని ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ఆ తర్వాత కథ విని బాగానే చెప్పారు కానీ అది ఆయనను అంతక ఆకట్టుకొలేదు’ అని రత్నాబాబు చెప్పుకొచ్చారు. అంతేగాక ఆ స్క్రిప్ట్‌ విన్న బన్ని తాను ఇది ఎందుకు చేయాలేనన్నారో కూడా చెప్పాడు. తన కథ విన్న బన్ని ఇది అంత కొత్తగా ఏం లేదని, రెగ్యూలర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఉందన్నారని ఆయన తెలిపారు.

‘నేను రాసిన కథ కొంచెం బోయపాటి శ్రీనివాస్‌, వీవీ వినాయక్‌ సినిమా స్టోరీ లైన్లకు దగ్గర ఉందని బన్ని అన్నారు. ఇందులో అంత కొత్తగా ఏం లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఈ మూవీ చేయాలని అన్న బన్ని మాటలు నన్ను ఆలోచింప చేశాయి. దీంతో అప్పటి నుంచి నా కథలో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నానని’ ఆయన పేర్కొన్నారు. కాగా ఆయన మొదటి సారిగా దర్శకత్వం వహించిన ‘బుర్ర కథ’ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇక రెండవ మూవీ ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకంటుందో విడుదలయ్యే వరకు వేచి చూడాలి మరి. 

మరిన్ని వార్తలు