షాక్‌.. మళ్లీ మూతపడనున్న థియేటర్లు?

4 Feb, 2021 12:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవలె తెరుచుకున్న థియేటర్లు తెలంగాణలో మళ్లీ మూతపడేలా కనిపిస్తున్నాయి. సినీ నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు నెలకొన్న వివాదమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. మల్టీప్లెక్సులకు ఉండే హక్కులనే సింగిల్ స్క్రీన్‌లకు కూడా వర్తింపజేయాలని థియేటర్‌ యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. మల్టీపెక్సుల మాదిరే పర్సంటేజ్‌ సిస్టమ్‌ను అమలుచేయాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా పెద్ద సినిమా అయితే విడుదలైన 6వారాల తర్వాత, అదే చిన్న సినిమా అయితే 4వారాల గ్యాప్‌ తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్‌ చేయాలని తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే మార్చి 1నుంచి థియేటర్లు మూసివేస్తామని హెచ్చరించారు.(ఆ సీన్లలో నటించడం తగ్గించేశా: సుమంత్‌)

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు.. తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ల మధ్య చర్చలు జరిగాయి. దగ్గుబాటి సరేష్‌బాబు ఏర్పాటైన ఈ సమావేశంలో డివివి దానయ్య, అభిషేక్ నామా, మైత్రి రవి, బివిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి తెరుచుకున్న థియేటర్లలో సినిమాల సందడి పెరిగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాలు సైతం భారీగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది సమ్మర్‌లోనూ చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల డిమాండ్లకు నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. (మండుటెండలో మట్టిలో కూర్చున్న మహేశ్‌ డైరెక్టర్‌)

మరిన్ని వార్తలు