నవ్వులు పూయిస్తోన్న ప్రభుదేవా ‘అబ్బాక డర్‌’ సాంగ్‌

13 Jul, 2022 13:42 IST|Sakshi

ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మై డియర్‌ భూతం’. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ మూవీ జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, మాస్టర్‌ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

(చదవండి: షాకింగ్‌.. రియాపై ఎన్‌సీబీ చార్జిషీట్‌, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?)

తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్‌ సింగిల్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ‘అబ్బాక డర్’ అంటూ సాంగే పాట నవ్వులు పూయిస్తోంది. ఇందులో ప్రభుదేవా, అశ్వంత్ చేసిన అల్లరికి అందరూ పగలబడి నవ్వాల్సిందే. ఇమ్మాన్ సంగీతాన్ని అందించగా.. ఆదిత్య సురేష్, సహన ఆలపించారు. డా. చల్లా భాగ్యలక్ష్మీ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి తెలుగులో మాటలను నందు తుర్లపాటి అందించారు.అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది.

మరిన్ని వార్తలు