బీ ఫిట్‌

1 Sep, 2020 02:38 IST|Sakshi
‘ఈఎంఎస్‌’ వర్కౌట్‌లో...

గ్లామర్‌ ఇండస్ట్రీలో ఫిట్‌నెస్‌ కీలకం. ఫిట్‌గా ఉండటానికి గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు స్టార్స్‌. ఎప్పటికప్పుడు ఆ ఫిట్‌నెస్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ‘రన్ రాజా రన్, రాజుగారి గది 2, కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ వంటి సినిమాల్లో నటించిన సీరత్‌ కపూర్‌ కూడా ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్‌. ఎప్పటికప్పుడు వర్కౌట్‌ చేస్తూ తనని తాను ఫిట్‌గా ఉంచుకుంటారామె.

‘బీ ఫిట్‌’ అన్నది ఆమె మంత్రం. తాజాగా ఓ ఫిట్‌నెస్‌ వీడియోను షేర్‌ చేసుకున్నారు సీరత్‌. ‘ఈఎంఎస్‌’ అనే సరికొత్త వర్కౌట్‌ను కొన్ని రోజులుగా సాధన చేస్తున్నారు. ఓ మెషీన్‌ను శరీరానికి అనుసంధానం చేసి వర్కౌట్స్‌ చేస్తూ అందులో రీడింగ్‌ను గమనించవచ్చు. ఇది కొంచెం కష్టమైన వర్కౌట్‌ అని,  ఇందులో ప్రావీణ్యం సంపాదిస్తున్నాననీ అన్నారామె. ప్రస్తుతం ‘మా వింత గాధ వినుమా’ అనే సినిమాలో నటిస్తున్నారు సీరత్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు