అందర్నీ ఒకేలా చూడాలి!

25 Aug, 2020 02:38 IST|Sakshi
సీరత్‌ కపూర్

సీరత్‌ కపూర్‌

‘‘అవకాశాల విషయంలో అందర్నీ సమానంగానే చూడాలి. ఇన్‌సైడర్స్, అవుట్‌సైడర్స్‌ అని వేరుగా చూడకూడదు’’ అంటున్నారు సీరత్‌ కపూర్‌. ప్రస్తుతం బంధుప్రీతి (నెపోటిజమ్‌), ఇన్‌సైడర్స్‌ వర్సెస్‌ అవుట్‌సైడర్స్‌ అనే చర్చ బాలీవుడ్‌లో తీవ్రంగా నడుస్తోంది. ఈ విషయం మీద ‘రన్‌ రాజా రన్, కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ ఫేమ్‌ హీరోయిన్‌ సీరత్‌ కపూర్‌ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘నెపోటిజమ్‌ ఏ పరిశ్రమలో అయినా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారికి ప్రత్యేకమైన గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది.

అది సహజం. కాదనలేం కూడా. కానీ అవకాశాల విషయంలో సమాన న్యాయం ఉండాలి. ప్రతిభను బట్టే అవకాశం ఇవ్వాలి. కేవలం స్టార్‌ కిడ్స్‌ మాత్రమే కాకుండా ప్రతిభ ఉన్న ప్రతీ ఒక్కరినీ నిజాయతీగా ప్రోత్సహించాలి. వారసులను, బయటినుంచి వచ్చేవాళ్లను ఒకేలా చూడాలి. అలాంటి వాతావరణం ఏర్పడేలా చేసే బాధ్యత అందరి మీదా ఉంది’’ అన్నారు సీరత్‌. ‘ప్రస్తుతం ‘మా వింత గాధ వినుమ’ అనే సినిమాలో నటిస్తున్నారు సీరత్‌.

మరిన్ని వార్తలు