హీటెక్కిస్తున్న‘సీటీమార్‌’ పెప్సీ ఆంటీ సాంగ్

21 Mar, 2021 13:51 IST|Sakshi

గోపీచంద్, తమన్నా జంటగా సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదలకానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్‌ సాంగ్‌తో పాటు ‘జ్వాలారెడ్డి’పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఆదివారం ఈ సినిమా నుంచి ఐటమ్‌ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. 'నా పేరే పెప్సీ ఆంటీ... నా పెళ్ళికి  నేనే యాంటీ...' అంటూ సాగే ఈ పాటను దర్శకుడు సంపత్ నంది రాశారు. కీర్తన, శర్మ ఆలపించారు.

క్రాక్ సినిమాలో 'భూం బద్దల్' సాంగ్‌తో ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ తెచ్చుకున్న అప్సర రాణి.. ఈ పాటకు స్టెప్పులేసింది. 'మా అమ్మకు పెళ్ళి కాకముందే కడుపులో పడ్డాను... నెలలు నిండక ముందే  భూమ్మీద పడ్డాను.... బారసాల కాకముందే బోర్లా పడ్డాను... టెన్త్ లోకి రాగానే వాల్ జంప్ లే చేశాను.... ఇంటర్ లోకి రాగానే బోయ్ ఫ్రెండ్ నే మార్చాను.... డిగ్రీ లోకి రాగానే దుకాణమే  తెరిసేశాను... పిజీ లోకి రాగానే ప్రపంచమే చూశాను' లాంటి మాస్‌ పదాలకు అప్స‌ర గ్లామ‌ర్ షో యాడ్‌ కావడంతో ఈ మాస్‌ సాంగ్‌ యూత్‌లో బలంగా దూసుకెళ్లింది. ఈ పాట‌కు మ‌ణిశ‌ర్మ బాణీ ఓ రేంజులోనే కుదిరింద‌ని చెప్పాలి. 

గత కొంతకాలంగా గోపీచంద్‌కి మంచి హిట్ దక్కడం లేదు. అయితే సీటీమార్ సినిమాతో మళ్ళీ భారీ హిట్ అందుకొని ఫాంలోకి వస్తాడన్న నమ్మకంగా ఉన్నాడట గోపీచంద్. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ అయితే సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ‘పెప్సీ ఆంటి’ మాస్‌ సాంగ్‌ ‘సిటీమార్‌’కు ఎంతవరకు ప్లస్‌ అవుతుందో చూడాలి మరి.

మరిన్ని వార్తలు