అలా పిలిస్తే కూత ఆగిపోద్ది!

23 Feb, 2021 00:24 IST|Sakshi

‘‘నన్నెవడైనా అలా (రేయ్‌ కార్తి) పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు పిలవాలి.. లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్‌ పిలవాలి.. ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది’.. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అంటూ గోపీచంద్‌ చెప్పే డైలాగ్స్‌తో ‘సీటీమార్‌’ టీజర్‌ విడుదలైంది. ‘గౌతమ్‌నంద’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్‌ సంపత్‌ నంది కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సీటీమార్‌’. పవన్‌  కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని సోమవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ సంపత్‌ నంది మాట్లాడుతూ– ‘‘కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ మూవీ ఇది. మీకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. తమన్నా, భూమిక, దిగంగనా సూర్యవంశీ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. సౌందర్‌ రాజన్, సంగీతం: మణిశర్మ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు