ధనుష్‌ని కలిసిన శేఖర్‌ కమ్ముల

3 Jul, 2021 07:54 IST|Sakshi

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్‌ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.4గా నారాయ‌ణ‌దాస్ నారంగ్‌, పుస్కూరు రామ్‌మోహ‌న్ రావు అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల‌లో తెర‌కెక్కించ‌నున్నారు. ప్రస్తుతం ధనుష్‌ ఓ తమిళ చిత్రం షూటింగ్‌ చేస్తూ, హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా తమ హీరోను శేఖర్‌ కమ్ముల, నారాయణ్‌ దాస్, సునీల్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు కలిశారు.

యూనివర్సల్ అప్పీల్ మరియు అత్యంత ప్రతిభావంతులైన నటుడు-దర్శకుడితో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే విధంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి  సోనాలి నారంగ్ సమర్ప‌కురాలు. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్న‌త‌మైన న‌టులు,టెక్నీషియ‌న్స్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది చిత్ర యూనిట్‌. త్వ‌ర‌లోనే వారి వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ యొక్క మ‌రిన్ని వివరాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

మరిన్ని వార్తలు