మళ్లీ అనారోగ్యానికి గురైన సీనియర్‌ నటుడు కార్తీక్

7 Apr, 2021 08:33 IST|Sakshi

చెన్నై: సీనియర్‌ నటుడు కార్తీక్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కార్తీక్‌ అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలం తర్వాత రాజకీయాలకు దూరమైన ఆయన పార్టీని కూడా రద్దు చేశారు.  ఇటీవల అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనునట్లు ప్రకటించారు. కాగా కార్తీక్‌ అనూహ్యంగా అనారోగ్యానికి గురై గత నెల 21న చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.  ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసిన వైద్యులు కార్తీక్‌ ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.  

కార్తీక్‌ ఇటీవల మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్న కార్తీక్‌ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను అడయార్‌లోని ప్రైవేట్‌ హాస్పిటల్లో చేర్చారు. కార్తీక్‌ శ్వాసకోస సంబంధిత సమస్యతో పాటు, అధిక రక్తపోటుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. 
చదవండి: కృతీ శెట్టి డ్యాన్స్‌ వీడియో చూశారా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు