7.5 కోట్లు మోసం.. పోలీసులకు సీనియర్‌ నటుడు నరేశ్‌ ఫిర్యాదు

18 Apr, 2021 11:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిజినెస్‌ విషయంలో కీస్టోస్‌ కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సీనియర్‌ నటుడు నరేశ్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింగం శ్రీనివాస్‌ అనే వ్యక్తి  కీస్టోన్ ఇన్ఫా కంపెనీల పేరుతో తమ బిల్డర్స్‌తో ఫినిక్స్‌లో అసోసియేట్‌ అయి సైనింగ్‌ అథారిటీగా ఉన్నాడని, తమ కుటుంబంతో ఉన్న పరిచయంతో ఏడున్నర కోట్లు హ్యాండ్‌ ఫైనాన్స్‌ ద్వారా తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆరేళ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదని, అందుకే సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. నరేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు