VK Naresh: ఇలాగైతే జనాలు థియేటర్‌కు ఎందుకు వస్తారు: నరేశ్‌ ఫైర్‌

27 Aug, 2022 19:50 IST|Sakshi

జూలైలో వరుసగా సినిమాలు ఫ్లాప్‌ కావడంతో.. ఈ ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకు రావడమే మానేశారని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ కంటెంట్‌ ఉంటే జనాలు వస్తారని బింబిసార, కార్తికేయ 2, సీతారామం వంటి సినిమాలు నిరూపించాయి. అయితే జనాలు థియేటర్‌కు రాకపోవడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయంటున్నాడు సీనియర్‌ నటుడు నరేశ్‌.

'టికెట్‌ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు థియేటర్‌కు రావడం లేదన్న మాట వాస్తవమే! కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సి, పాప్‌కార్న్‌ రూ,20, రూ.30కే దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300. అంటే ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు ఎందుకు వస్తారు? వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటారు. కాస్త ఆలోచించండి' అని నరేశ్‌ ట్వీట్‌ చేశాడు.

ఆ వెంటనే మరో ట్వీట్‌లో.. 'నేనేమంటున్నానంటే.. ఒకప్పుడు వారం రోజులపాటు సినిమాలు చక్కగా ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రెండో రోజుకే థియేటర్‌ ఖాళీ అయిపోతుంది. ముందు థియేటర్స్‌లో ఖర్చు తగ్గిస్తే జనాలు ఎక్కువసార్లు సినిమాలు చూసేందుకు వస్తారు' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి.

చదవండి: ఓటీటీలో రామారావు ఆన్‌ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్‌
అనసూయ వివాదం.. నన్నెందుకు తిడుతున్నారు?

మరిన్ని వార్తలు