Senior Actor Shiva Krishna: ‘రానా నాయుడు’ సిరీస్‌పై నటుడు శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు

17 Mar, 2023 21:26 IST|Sakshi

ఓటీటీలు వచ్చాక అడల్ట్‌ కంటెంట్‌, అభ్యంతరకర సన్నివేశాలతో వెబ్‌ సిరీస్‌లు ఎక్కువయ్యాయంటూ సీనియర్‌ నటుడు శివకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. గతంలో సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా పని చేసిన ఆయన తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ.. ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్‌ ఉండాలన్నారు. ఈ మధ్య వెబ్‌ సిరీస్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువైపోయాయని, రీసెంట్‌గా ఓ వెబ్‌ సిరీస్‌ చూశానంటూ ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ గురించి ఆయన చెప్పకనే చెప్పారు.

చదవండి: ‘నాటు నాటు సాంగ్‌ పెడితేనే జెహ్‌ తింటున్నాడు, అది కూడా తెలుగులోనే’

‘నిన్నే ఓ వెబ్‌ సిరీస్‌ చూశా. మరి దారుణంగా ఉంది. ఆల్‌ మోస్ట్‌ అది ఓ బ్లూ ఫిలిమే అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణమైన సినిమా చూడలేదు. ఇది మన సంసృతి, కల్చర్‌ కాదు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమానా? అది’ అంటూ పైర్‌ అయ్యారు. అసలు ఇంట్లో బెడ్‌ రూమ్‌, కిచెన్‌ ఎందుకు ఉంటాయి. భార్య భర్తలు బెడ్‌రూంలో పడుకుంటారు. బెడ్‌ రూం తలుపులు తీసి ఉంచడం.. పిల్లలు అది చూడటం ఏంటి? మన సాంప్రదాయం ఇదేనా? ఏమైపోతుంది మన సంసృతి’ అంటూ ఫైర్‌ ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాటి వల్లే పిల్లలు చెడిపోతున్నారన్నారు.

చదవండి: ‘కోపంతో పుష్ప 2 సెట్‌ వీడిన రష్మిక!’ బన్నీనే కారణమంటూ ట్వీట్‌

‘దేశం ఆర్థికంగా పతనమైనా తిరిగి కోలుకుంటుంది. కానీ, సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడటం కష్టం. సినిమాల్లో బూతు ఉంటే, థియేటర్స్‌కి వచ్చిన వారికి మాత్రమే అది తెలుస్తుంది. అదే వెబ్‌ సిరీస్‌లు అలా కాదు. ఇలాంటివి చూడకుండా పిల్లలను నియంత్రించడం కష్టమైపోతోంది. ఈ మధ్య కాలంలో చాలామంది పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లే. అందుకే కచ్చితంగా ఓటీటీకి సెన్సార్ ఉండాల్సిందే’ అని శివకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కామెంట్స్‌ విన్న నెటిజన్లంతా ఆయన ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ ఉద్దేశించే మాట్లాడారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు