గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి.. ఎవరో తెలుసా?

21 Mar, 2023 18:51 IST|Sakshi

సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీలు ఎక్కడికెళ్లినా తమ అభిమానులతో ఫోటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. ఇటీవల సీనియర్ హీరోయిన్స్ సైతం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. కానీ ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించని ఓ సీనియర్ నటి తాజాగా కెమెరాకు చిక్కింది. బుల్లితెరతో పాటు పలు చిత్రాల్లో తనదైన నటనతో పేరు తెచ్చుకున్నారు. 2003లో వచ్చిన తమిళ బాయ్స్ చిత్రం ద్వారా గుర్తింపు దక్కింది.

ఆమె ప్రధాన పాత్రలో నటించిన మొదటి చిత్రం కుర్‌ కురే. తెలుగులో దొంగ రాముడు అండ్ పార్టీ, గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, సీమ శాస్త్రి, ఆంజనేయులు వంటి సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటించిన భువనేశ్వరి వెండితెరకు దూరమై పలు సీరియల్స్‌లో నటించింది. ఏపీలోని చిత్తూరు ఆమె స్వస్థలం కాగా.. నటనపై ఆసక్తితో మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టింది. 

చాలా రోజుల తర్వాత కెమెరా కంటికి చిక్కింది భువనేశ్వరి. తిరుమల దర్శనానికి వచ్చిన ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో సినిమాల్లో తన అందంతో ‍అలరించిన ఆమెను ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోక తప్పదు. కెరీర్ ప్రారంభంలో డబ్బింగ్ సీరియల్స్‌లో నటించిన భువనేశ్వరి.. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్‌ కొట్టేసింది. చాలా వరకు బోల్ట్ సీన్స్‌లోనే నటించింది. కానీ అనుకోకుండా ఓ సారి ఊహించని షాక్ ఇచ్చింది. చెన్నైలో ఓ వ్యభిచార గృహాన్ని నడిపారని ఆమెపై ఆరోపణలు కూడా వచ్చాయి.  అప్పట్లో ఆ వార్త సంచలనంగా మారింది. తాజాగా ఆమె తిరుమలకు రావడంతో కెమెరాలకు చిక్కింది. 

(ఇది చదవండి: డబ్బుల కోసం అలాంటి వార్తలు రాయడం దుర్మార్గం: కోటా శ్రీనివాసరావు)

మరిన్ని వార్తలు