Actress Gautami : నటి గౌతమి కూతురు త్వరలోనే హీరోయిన్‌గా పరిచయం కానుందా? ఫోటోలు వైరల్‌

11 Mar, 2023 10:53 IST|Sakshi

సీనియర్‌ నటి గౌతమి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు, తమిళం తదితర దక్షిణాది భాషల్లో నటించి మెప్పించిన ఆమె అగ్రహీరోలతో జతకట్టింది. స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే  ఓ ప్రముఖ వ్యాపార వేత్త సందీప్‌ భాటియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే  వీరి పెళ్లి కథ ఏడాదికే ముగిసిపోయింది.

మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. అప్పట్నుంచి ఆమె తల్లి గౌతమి వద్దే ఉంటోంది. అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుబ్బలక్ష్మీ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్‌ చేస్తుంటుంది.

తాజాగా ఆమె లేటెస్ట్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందంతో సుబ్బలక్ష్మీ మెస్మరైజ్‌ చేస్తుంది. మరి త్వరలోనే ఈమె కూడా తల్లి గౌతమి లాగే సినిమాల్లోకి వస్తుందా అన్నది చూడాల్సి ఉంది. 

A post shared by subbu tadimalla (@maybesubbu)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు