Jayalalitha: సీన్ చెప్తానని గదిలోకి పిలిచి ‍అలా..! : జయలలిత

15 Sep, 2023 19:08 IST|Sakshi

సీనియర్ నటి జయలలిత గురించి తెలియనివారి ఉండరు. అప్పట్లోనే తెలుగులో అనేక సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. వెండితెరపై నెగిటివ్‌, కమెడియన్‌, గ్లామర్‌ రోల్స్‌తో మెప్పించారు. మలయాళ చిత్రాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జయలలిత..  తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాలు చేసింది.  ఆమె కమల్‌ హాసన్‌ ఇంద్రుడు చంద్రుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత మామ అల్లుడు, లారీ డ్రైవర్‌, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, జంబలకిడి పంబా, మెకానిక్‌ అల్లుడు, ముఠా మేస్త్రి, హంగామా, గోపీ గోపిక గోదావరి, గ్రహణం, భరత్‌ అనే నేను లాంటి సహాయక పాత్రల్లో నటించారు.

అలాగే వ్యాంప్ పాత్రలతో ఆమె ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నారు. బుల్లితెరపైనే కాన్సంట్రేట్ చేసిన ఆమె బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి తదితర సీరియల్స్ చేశారు. సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేసిన జయలలిత స్టార్‌ నటిగా ఎదిగారు. ఇక ఆర్థికంగానూ  సెటిలైన ఆమె కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే మలయాళ డైరెక్టర్ వినోద్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడితో ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన ఆమె ఇంట్లో వాళ్లని ఎదిరించి ఆయనతో ఏడడుగులు వేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయలలిత తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

(ఇది చదవండి: డ్రగ్స్ కేసు.. నవదీప్‌ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం!)

జయలలిత మాట్లాడుతూ.. 'నేను అత్యధికంగా లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నా. ఇంద్రుడు చంద్రుడు సినిమాకు రామానాయుడు ఇచ్చారు. అంత మంచి క్యారెక్టర్ ఏ సినిమాలోనూ రాలేదు. నా రెమ్యునరేషన్‌ గురించి అంతా మా నాన్నే. డేట్స్‌ కూడా చూసుకునేవారు. బాలయ్య, చిరంజీవితో సినిమాలు చేశా. బాలయ్య చాలా సరదాగా మాట్లాడేవారు. చిరంజీవి కూడా ఎప్పుడు కనిపించినా అప్యాయంగా పలకరించేవారు. సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉంటాయి. నాకు సెట్‌లో టైంకు భోజనం పెట్టకపోతే నిర్మాతకు శాపం పెడతా.' అంటూ చెప్పుకొచ్చారు. 

అసిస్టెంట్ డైరెక్టర్‌ అసభ్యంగా.. 

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తీరు గురించి మాట్లాడుతూ..' ఓ మలయాళం మూవీ చేసేటప్పుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు మలయాళం భాష రాదు. అప్పుడు మలయాళంలో సినిమా చేసేందుకు ఫస్ట్ టైమ్ వెళ్లా. అందులో రేప్ సీన్ గురించి చెప్పాలని గదిలోకి రమ్మన్నారు. లోపలికి వెళ్లాకా అసిస్టెంట్ డైరెక్టర్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కానీ ఆ తర్వాత అతను ఆరు నెలల్లోనే చనిపోయాడు. అతనెలా చచ్చాడో కూడా నాకు తెలియదు.' నటి జయలలిత చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ సినిమాలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్నట్లు జయలలిత తెలిపారు. వ్యాంప్ పాత్రల వల్లే కారణంగానే ఆ ఛాన్స్ పోయిందన్నారు. అంతేకాకుండా కళాతపస్వి కే. విశ్వనాథ్ బంధువుతో పెళ్లి సంబంధం కూడా పోయిందని.. కుటుంబం కోసమే వద్దకు వచ్చిన పాత్రలన్నీ చేసినట్లుగా జయలలిత వెల్లడించారు.

(ఇది చదవండి: అపాయింట్‌మెంట్‌ అడిగితే షాకయ్యారు.. విశాల్ కామెంట్స్ వైరల్!)

మరిన్ని వార్తలు