Senior Actress Jhansi: ‘సావిత్రి గురించి జెమిని గణేశన్‌ ఇచ్చిన పత్రికా ప్రకటన చూసి బాధపడ్డాను’

17 Dec, 2022 18:24 IST|Sakshi

సీనియర్‌ నటి ఝాన్సీ.. ఒకప్పుడు స్టార్‌ హీరోల సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు ఓ అద్దే ఇంట్లో ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె చెన్నైలో లగ్జరీ ఇంట్లో రాజసంగా బ్రతికారు. కానీ ఒక్క మూవీ ఫ్లాప్‌తో ఆస్తులన్నీ అమ్మేసిన పరిస్థితి ఎదురైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఆమె. 78 ఏళ్ల వయసులో కష్టాలు పడుతూ పుట గడవడం కూడా ఇబ్బందిగా మారిందట ఆమె జీవితం.

చదవండి: అందుకే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికాను ట్రోల్‌ చేస్తున్నారు: నటి రమ్య

స్క్రీన్‌ హీరోయిన్‌గా, నటిగా ఆకట్టుకున్న ఆమె కళ్లతోనే హావభావాలను పలికించేవారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఝాన్సీ చాలా ఏళ్ల తర్వాత తెరముందుకు వచ్చారు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ఆమె ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మహానటి సావిత్రి గురించిన ఓ షాకింగ్‌ విషయం రివీల్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఎక్కువగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. సావిత్రి, కేఆర్‌ విజయలతో మాట్లాడేదాని. అంతేకాదు తరచూ సావిత్రి ఇంటికి కూడా వెళ్లేదాన్ని.

నాకంటే ముందే సావిత్రిగారు సినిమాల్లోకి వచ్చారు. తననే స్ఫూర్తిగా తీసుకుని నటించేవాళ్లం. తెరపై ఆమె అందంగా, హావభావాలను పలికించేవారు. సావిత్రిలా నటించాలని నటనలో తనని అనుసరించేవారు. సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. అయితే సావిత్రి చివరి రోజుల్లో వెళ్లి చూశారా? అని ప్రశ్నించగా.. ‘ఆ సమయంలో సావిత్రిని చూడలేకపోయానని బాధపడ్డారు. అసలు ఆవిడని చూడలేకపోయేవాళ్లమంట. అంత మనిషి చిన్న పిల్లలా అయిపోయారట. అందుకే తనని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేనని నేను వెళ్లలేదు.

చదవండి: విషాదం.. అవతార్‌ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి

అయితే ఎంతో రాజసంగా బతికిన సావిత్రి గురించిన ఓ వార్త నన్ను చాలా బాధించింది. అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని నెలలు కొమాలో ఉన్నారు. ఆ సమయంలోవైద్యం చేయించేందుకు డబ్బుల ఆమె భర్త జెమిని గణేశన్‌ ఓ ప్రకటన ఇచ్చారు. సావిత్రి చికిత్స కోసం డబ్బు కావాలని, దాతలు ఈ అడ్రస్‌ డబ్బు పంపించగలరు అంటూ ఆయన పత్రిక ప్రకటన ఇచ్చారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఎంతో ధనవంతురాలు, మహానటి అయిన ఆమె జీవితం చివరికి ఇలా అయ్యిందేంటని అనిపించింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా.. జాగ్రత్తపడకపోవడం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే సావిత్రి జీవితం ఇలా అయ్యిందేమో అని ఆమె అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు