సీనియ‌ర్ న‌టి క‌విత ఇంట్లో విషాదం

17 Jun, 2021 08:23 IST|Sakshi
న‌టి క‌విత ( ఫైల్‌ ఫోటో )

మాయ‌దారి క‌రోనా ఎంతోమందిని పొట్ట‌న పెట్టుకుంది. చిన్న పిల్లల‌ నుంచి పండు ముస‌లి వ‌ర‌కు ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా అనేక‌మంది అయిన‌వారిని పోగొట్టుకుని శోక‌సంద్రంలో మునిగిపోతున్నారు. అటు సినీ ప‌రిశ్ర‌మ‌ను కూడా ఈ వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడించింది. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు దీని బారిన ప‌డి అర్ధాంత‌రంగా త‌నువు చాలించారు. 

తాజాగా సీనియ‌ర్ న‌టి క‌విత ఇంట్లో క‌రోనా తీర‌ని శోకాన్ని మిగిల్చింది. క‌రోనాతో పోరాడుతున్న ఆమె కొడుకు సంజ‌య్ రూప్‌ తుది శ్వాస విడిచాడు. మ‌రోవైపు ఆమె భ‌ర్త ద‌శ‌ర‌థ రాజ్‌ గ‌త కొన్ని రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా క‌విత 'ఓ మ‌జ్ను' అనే త‌మిళ సినిమాతో 11 ఏళ్ల‌కే వెండితెర అరంగ్రేటం చేసింది. సుమార్ 50కి పైగా త‌మిళ చిత్రాల్లో త‌ళుక్కున మెరిసిన ఆమె తెలుగు, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ సినిమాల్లోనూ న‌టించింది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది.

చ‌ద‌వండి: Trishanku Movie: హీరోగా రకుల్‌ సోదరుడు.. ఫస్ట్‌ సాంగ్‌ విడుదల

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు