Actress Seetha : నటి సీత 55 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని అందంతో మెస్మరైజ్‌

1 Dec, 2022 09:19 IST|Sakshi

తమిళసినిమా: మనసుకు వయసుతో పని లేదంటారు. అయితే ఆలోచనలు, అలవాట్లపై ప్రభావం చూపుతాయి. నటి సీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1985లో పాండిరాజ్‌ దర్శకుడిగా, కథానాయకుడిగా పరిచయం అయ్యారు. అదే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన నటి సీత. తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్న లక్కీ హీరోయిన్‌. ఆ తరువాత ప్రముఖ నటులతో జతకట్టి పాపులర్‌ అయ్యారు. తెలుగు తదితర భాషల్లోనూ నటించారు. కాగా 1990లో నటుడు పార్తీపన్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన పుదియపాదై చిత్రంలో ఆయనకు జంటగా సీత నటించారు.

ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. దీంతో నటనకు దూరమయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2001లో విడాకులు తీసుకున్నారు. నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అక్క, అమ్మ, పాత్రల్లో నటిస్తున్నారు. బుల్లితెర, తెలుగులోన నటిస్తున్న సీత 2010లో సురేష్‌ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలువ లేదు.

నటనను కొనసాగిస్తున్న సీత వయసు జస్ట్‌ 55. తాజాగా ఆమె స్పెషల్‌ ఫొటో షట్‌ చేసుకుని ఆ ఫొటోలను సావజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ ఫొటోలను చూస్తే కొత్తవారు అనుకుంటున్నారు. ఇలా సీతను చూస్తే అందానికి వయసుకు సంబంధం ఉండదనిపిస్తోంది. తన అవయవ సంపదను తెలియచేయడానికే సీత ఈ ఫొటోలను సామాజిక మాద్యమాలకు విడుదల చేశారా? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

A post shared by Seetha PS (@seethaps67)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు