Gudipudi Srihari: ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి కన్నుమూత..

5 Jul, 2022 17:39 IST|Sakshi

Gudipudi Srihari Passed Away: ప్రముఖ సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (జులై 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గతేడాది నవంబర్‌లో శ్రీహరి భార్య లక్ష్మీ మరణించారు. అయితే భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన ఆయన ఇంట్లో జారి పడటంతో తొంటి వెముక విరిగింది. దీంతో నిమ్స్‌ ఆస్పత్రిలో సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అయితే ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. శ్రీహరి కుమారుడు స్వదేశానికి వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం. 

గుడిపూడి శ్రీహరి 1968లో 'ది హిందూ'కు కంట్రిబ్యూటర్‌గా పాత్రికేయ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అనంతరం ఈనాడు, ఫిల్మ్‌ ఫేర్‌ వంటి పత్రికలలో పనిచేశారు. హైదరాబాద్‌ ఆల్ ఇండియఆ రేడియోలోనూ న్యూస్‌ బ్రాడ్‌ కాస్టర్‌గా రాణించారు. సుమారు 55 ఏళ్లపాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా చిత్ర పరిశ్రమకు సెవలందించారు. 1969 నుంచి ది హిందూ పత్రికలో రివ్యూలు రాయడం ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక తెలుకు సినిమాలకు రివ్యూలు రాశారు. 1985లో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు అందుకున్న 'మాకూ స్వాతంత్య‍్రం కావాలి' సినిమాకు శ్రీహరి మాటలు  రాశారు. 2013 సంవత్సరానికి గానూ ఆయనకు తెలుగు విశ్వవిద్యాలయం 'పత్రికా రచన'లో 'కీర్తి పురస్కారాన్ని' ప్రకటించింది. గుడిపూడి శ్రీహరి మృతిపట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. 

చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్‌ నటుడు మృతి
చిరంజీవి పేరు మారింది చూశారా ! కారణం ఇదేనా ?
హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్‌ నిలిపివేత..

మరిన్ని వార్తలు