తెలుగు చిత్రసీమలో విషాదం..ప్రముఖ గాయకుడు మృతి

7 May, 2021 01:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ సినీ గాయకుడు జి.ఆనంద్‌ (67) కరోనా బారిన పడి గురువారం రాత్రి హఠాన్మరణం చెందా రు. కరోనా చికిత్సలో భాగంగా సకాలంలో వెంటిలేటర్‌ లభించకపోవడంతో ఆనంద్‌ మృత్యువాత పడినట్లు తెలిసింది. ఆయన స్వస్థలం  శ్రీకాకుళం జిల్లా తులగమ్‌ గ్రామం. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో కొనసాగుతున్నారు. స్వరమాధురి సంస్థ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించారు. ప్రస్తుతం సినీ గాయనీ గాయకులుగా ఉన్న పలువురిని ఈ సంస్థ ద్వారా ప్రోత్సహించారు.
 
‘ఒక వేణువు వినిపిం చెను’ (అమెరికా అమ్మాయి), ‘దిక్కులు చూడకు రామయ్య.., ‘విఠలా విఠలా పాండురంగ విఠలా..’ వంటి సూపర్‌ హిట్‌ పాటలను ఆనంద్‌ పాడారు. కృష్ణ నటించిన ‘పండంటి కాపురం’, చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ తదితర చిత్రాల్లో కూడా ఆయన పాటలు పాడారు. ‘గాంధీనగర్‌ రెండో వీధి’, ‘స్వాతంత్య్రానికి ఊపిరి పోయండి’, ‘రంగవల్లి’ చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అలాగే కొన్ని సీరియల్స్, అనువాద చిత్రాలకూ సంగీత సారథ్యం వహించారు.

  

చదవండి: బాలీవుడ్‌ నటి అభిలాషా పాటిల్ కన్నుమూత

మరిన్ని వార్తలు