సీరియల్‌ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్‌

18 May, 2022 20:07 IST|Sakshi

Serial Actress Deepa Jagadeesh Got Married: కన్నడ, తెలుగు సీరియల్స్‌తో పాపులర్ అయిన నటి దీపా జగదీష్. 2018లో ప్రీతి కేళి స్నేహ కలేడుకొల్లబెది చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత తెలుగు సీరియల్‌ ప్రేమ నగర్‌లో వాణి శ్రీ, ముఖేష్‌ గౌడ్‌, ప్రమోధినితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సీరియల్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అనంతరం మనసినక్కరే, బ్రహ్మాస్త్ర, కావ్యాంజలి, క్రిటికల్‌ కీర్తనేగలు, మల్లి నిండు జాబిలి వంటి తదితర సీరియల్స్‌తో మంచి గుర్తింపు పొందింది. 

బుధవారం (మే 18) దీపా జగదీష్‌ వివాహం జరిగింది. సాగర్‌ అనే వ్యక్తిను పెళ్లాడింది. దీపా జగదీష్‌కు తాళి కట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఇది చూసిన అభిమానులు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న విశ్వక్ సేన్‌.. డైరెక్టర్‌ రియాక్షన్‌

A post shared by CelebrityNews (@industrycelebritynews)

మరిన్ని వార్తలు