ఘనంగా సీరియల్‌ నటి కీర్తి సీమంతం..ఫోటోలు వైరల్‌

8 May, 2021 13:25 IST|Sakshi

ప్రముఖ సీరియల్‌ నటి కీర్తి సీమంతం తన నివాసంలో ఘనంగా జరిగింది. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నటి కీర్తి భర్త ధనుష్‌ కూడా సీరియల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాకుండా కీర్తి బావ నిరుపమ్‌ అదేనండీ డాక్టర్‌బాబు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్‌ అన్న సంగతి తెలిసిందే. ఈయన భార్య మంజలా పరిటాల కూడా సీరియల్స్‌లో నటిస్తున్నారు. కీర్తి-దనుష్‌ మొదటిసారి తల్లిదండ్రులు కానుండటంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక కన్నడ సీరియల్స్‌తో బాగా గుర్తింపు పొందిన కీర్తి తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

 


 

చదవండి : మొదటిసారి కూతురి ఫోటోను షేర్‌ చేసిన హరితేజ
ఒంటరిగానే డెలివరీకి వెళ్లా.. హరితేజ ఎమోషనల్‌ వీడియో

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు