షూటింగ్‌ గ్యాప్‌లో క్రికెట్‌ ఆడిన అక్షయ్‌కుమార్‌- షారుఖ్‌ ఖాన్‌

22 Jun, 2021 20:46 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు షారుఖ్‌ ఖాన్‌, అక్షయ్‌కుమార్‌లు క్రికెట్‌ ఆడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీళ్లిద్దరు కలిసి క్రికెట్‌ ఎప్పుడు ఆడారబ్బా? అని నెటిజన్లలో సందేహాలు మొదలయ్యాయి. ఇది పాతికేళ్ల క్రితం నాటి ఫోటో. షారుఖ్‌ హీరోగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ సీనిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్‌ కీలకపాత్రలో నటించారు. ఈ సందర్భంలో ఓ రోజు షూటింగ్‌ సమయంలో విరామం లభించడంతో అక్షయ్‌, షారుఖ్‌ క్రికెటర్లుగా అవతారం ఎత్తారు. అక్షయ్‌ బ్యాటింగ్‌ చేయగా షారుఖ్‌ కీపింగ్‌ చేస్తూ ఆ ఫొటోలో కనిపించారు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక 1997లో వచ్చిన ‘దిల్‌ తో పాగల్‌ హై’ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది. ట్రైయాంగిల్‌ లవ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాధురి దీక్షిత్‌, కరిష్మాకపూర్‌ హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాల విషయానికి వస్తే 2018లో ‘జీరో’తో అలరించిన షారుఖ్ చాలా కాలం గ్యాప్‌ అనంతరం ‘పఠాన్‌’ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌కు జోడీగా దీపికి పదుకొణె నటించనుంది. మరోవైపు అక్షయ్‌కుమార్‌ బెల్‌బాటమ్‌, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, బచ్చన్‌పాండే సహా ఆత్రంగి రే సినిమాల్లో నటిస్తున్నారు. 

చదవండి : 'నా గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సోనూభాయ్‌ హెల్ప్‌ చేస్తారా'?
అప్పట్లో షారుక్‌ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి

మరిన్ని వార్తలు