Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌, అట్లీ సినిమా టైటిల్‌ ఖరారు

2 Jun, 2022 21:26 IST|Sakshi

మాస్‌ డైరెక్టర్‌గా అట్లీకి కోలీవుడ్‌లో మంచి పేరుంది. అట్లీ- విజయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తెరి, మెర్సిల్‌, బిగిల్‌ సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే! తెలుగులోనూ ఈ సినిమాలు మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఈ దర్శకుడు ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో నయనతార కథానాయికగా నటిస్తుండగా సన్యా మల్హోత్రా, సునీల్‌ గ్రోవర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

అయితే ఈ సినిమాకు జవాన్‌ అన్న టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు జవాన్‌ టీజర్‌ కూడా రెడీ అయిందని, దీని నిడివి ఒక నిమిషం 34 సెకన్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో జవాన్‌ (#jawan), షారుక్‌ ఖాన్‌ (#ShahRuKhan) హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతున్నాయి.

చదవండి: ‘ఛాతీలో భారంగా ఉందంటూ కుప్పకూలిన కేకే.. అలా చేసుంటే బతికేవారు’
మేనేజర్‌ను ఒంటరిగా కలిస్తే ఎక్కువ డబ్బులిస్తామన్నారు

మరిన్ని వార్తలు