షారుఖ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. పఠాన్‌ మళ్లీ రాబోతున్నాడు!

21 Feb, 2024 10:49 IST|Sakshi

షారుక్‌ ఖాన్‌ కెరీర్‌లో రూ. వెయ్యి కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రం ‘పఠాన్‌’ (2023). వైఆర్‌ఎఫ్‌ (యశ్‌రాజ్‌ ఫిలింస్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ‘పఠాన్‌’ సినిమాను నిర్మించారు. షారుక్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌ చేశారు. కాగా ‘పఠాన్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘పఠాన్‌ 2’ తెరకెక్కించే పనిలో ఉన్నారట దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌.

ఆల్రెడీ ‘పఠాన్‌ 2’ స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలైందని, స్టోరీ బేసిక్‌ ఐడియాకు షారుక్‌ ఖాన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, వైఆర్‌ఎఫ్‌ స్పై యూనిర్స్‌లో భాగంగానే ‘పఠాన్‌’ ఉంటుందని బాలీవుడ్‌ భోగట్టా. ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది  డిసెంబరులో ప్రరంభం కానుందని టాక్‌. 

whatsapp channel

మరిన్ని వార్తలు