Shah Rukh Khan: ఓకే ఏడాదిలో రెండు చిత్రాలు.. ఆ విషయంలో తొలి నటుడిగా రికార్డ్!

25 Sep, 2023 18:32 IST|Sakshi

కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్‌ షారుక్‌ ఖాన్‌ కాంబో వచ్చిన జవాన్ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈనెల 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటింది. ఇండియాలో ఇప్పటి వరకు రూ.560 కోట్లు వసూలు చేసింది.  రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. జవాన్ మూవీ వెయ్యి కోట్లు అధిగమించడంపై అట్లీ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. 

(ఇది చదవండి: పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??)

'దేవుడు మా పట్ల చాలా దయతో ఉన్నాడు' అంటూ జవాన్‌ మూవీ క్లిప్‌ను షేర్ చేశారు. ఈ మైల్‌ స్టోన్‌కు కారణమైన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ ఏడాదిలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన షారుక్ రెండో చిత్రమిది. ఒకే ఏడాదిలో రెండు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ నటుడు షారుఖ్ ఖాన్ ఘనత సాధించారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇదంతా షారుక్ హవా అని.. త్వరలోనే రూ.1500 కోట్లకు చేరుకుంటుందని కామెంట్ చేశారు. 

పఠాన్ బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్

అయితే ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కొల్లగొట్టింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం  నాలుగు వారాల తర్వాత ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును దాటింది. పఠాన్‌తో పోలిస్తే.. జవాన్ కేవలం 18 రోజుల్లోనే ఈ మార్క్‌ని దాటింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, గిరిజా ఓక్ సంజీతా భట్టాచార్య కూడా నటించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, దీపికా పదుకొణె కూడా అతిథి పాత్రలో కనిపించారు. 

(ఇది చదవండి: నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి)

మరిన్ని వార్తలు