వామ్మో! షారుక్‌కు అంత రెమ్యునరేషన్‌ కావాలంట

25 Mar, 2021 14:45 IST|Sakshi

బాలీవుడ్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా కింగ్‌ ఖాన్‌ షారుక్‌ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రస్తుతం ఖాన్‌  ‘పఠాన్‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై  ఇప్పటికే భారీ అంచనాలే  నెలకొన్నాయి. లీకుల బెడద కారణంగా రహస్యంగా ‘పఠాన్‌‘ చిత్రీకరణను జరుపుతున్నారు. అలాగే చిత్రానికి సంబంధించి టైటిల్‌ తప్ప ఇంకే సమాచారం అధికారికంగా ప్రకటించలేదు. మరో పక్క పఠాన్‌ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి హైప్‌ ఉంది కనుకే షారుక్‌ కూడా భారీ మొత్తంలో తన రెమ్యునరేన్‌ అడిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 100 కోట్లు డిమాండ్‌ చేసినట్లు బీటౌన్‌లో టాక్‌.

అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయినా జీరో తర్వాత రెండేళ్లుగా ఖాన్‌  వెండితెరపై కనపడకపోవడం, చాల కాలం తర్వాత యాక్షన్‌ డ్రామాలో నటించడంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్‌ రావడంతో ఇంత మొత్తాన్ని అడిగే అవకాశం లేకపోలేదు. పఠాన్ చిత్రం గతేడాది నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లింది . 2022లో ఈ చిత్రాన్ని  విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించగా, జాన్‌ అబ్రహాం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ‘వార్‌’ చిత్రదర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్నారు. సంగీత ద్వయంగా పేరున్న విశాల్-శేఖర్ పాటలు సమకూర్చనున్నారు. ఇందులో సీక్రెట్‌ ఏజెంట్ పాత్రలో నటిస్తున్న షారుక్‌ ముంబై రౌడీలను రఫ్ఫాడించబోతున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు