Shah Rukh Khan Jawan: షారూక్ ఖాన్ ‘జవాన్’.. ఆ డేట్‌ను గుర్తు పెట్టుకోండి!

9 Jul, 2023 21:27 IST|Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటిస్తోన్న  భారీ బ‌డ్జెట్ మూవీ ‘జవాన్’. ఈ చిత్రం కోసం ప్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. జవాన్ ప్రివ్యూను  జూలై 10న ఉదయం 10:30 గంటలకు రిలీజ్ చేస్తున్న‌ట్లు షారూక్ త‌న ట్విటర్ ద్వారా ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!)

అయితే ఈ సినిమాను  ఎలా ఉండ‌బోతుంది? అస‌లు షారూక్ ఖాన్ స్టార్ డ‌మ్‌ను అట్లీ ఎలా చూపించ‌బోతున్నారు? అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. దీంతో  సినిమాపై  ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాతో పాటు కౌంట్ డౌన్‌లో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని మేక‌ర్స్ ప్రకటించారు. కాగా.. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పతాకంపై  గౌరీ ఖాన్ నిర్మాత‌గా.. జ‌వాన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా  ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. 

(ఇది చదవండి: నా నడుము 22.. ఆ రోజులు కనుమరుగై పోయాయి: స్టార్ హీరోయిన్)

మరిన్ని వార్తలు