లోదుస్తుల కలర్‌ అడిగిన ఫ్యాన్‌కు షారుక్‌ చురక

31 Mar, 2021 20:58 IST|Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తరచూ సోషల్‌ మీడియాలో #AskSRK సెషన్‌ నిర్వహించి అభిమానులతో ఇంటరాక్ట్‌ అవుతుంటాడు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలి సమాధాలు ఇస్తూ చమత్కరిస్తుంటాడు షారుక్‌. ఈ నేపథ్యంలో బుధవారం కూడా ట్విటర్‌లో షారుక్‌ ఆన్‌లైన్‌ సెషన్‌ నిర్వహించాడు. ఆస్క్‌మీఎస్‌ఆర్‌కే సెషన్‌లో ఆయన లోదుస్తుల(అండర్‌ వేర్‌)‌ కలర్‌ చెప్పమని అడిగిన అభిమానికి.. ‘నేను కేవలం క్లాసీ, ఎడ్యూకేటేడ్‌ ప్రశ్నలకే సమాధానాలు ఇస్తానంటూ’ అతడికి తనదైన శైలిలో చురక అంటించాడు.

అలాగే మీరు బాత్‌రూంకు వెళ్లితే ఎందుకు అంత సమయం తీసుకుంటారని మరో అభిమాని అడిగన ప్రశ్న అడిగాడు. దీనికి కింగ్‌ ఖాన్‌ ‘అది తెలుసుకోవాలన్న మీ ఆరాటం చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది.. ఈ సారి వాష్‌రూంకు వెళ్లినప్పుడు మీకు వీడియో దీసి పంపిస్తా’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక మీ భార్య గౌరీ ఖాన్‌కు మీలో ఎక్కువగా నచ్చేది ఏంటని అడగ్గా.. ‘నేను రుచికరమైన వంట చేస్తాను.. ఇంటిని శుభ్రంగా ఉంచుతాను.. అలాగే పిల్లలను చూసుకుంటాను అందుకే తనకు నేనంటే ఇష్టం.. ఎంతో మంది అందమైన అబ్బాయిలు కూడా పెళ్లి తర్వాత ఇలానే చేస్తారని భావిస్తున్న’ అంటూ చెప్పుకొచ్చాడు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు