Shah Rukh Khan: బాలీవుడ్‌ బాద్‌షాకు చేదు అనుభవం.. ఎయిర్‌పోర్ట్‌లో గంటలపాటు ఆపేసిన అధికారులు

12 Nov, 2022 16:41 IST|Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది.  ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్‌ స్టార్‌ను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయన వద్ద నుంచి ‍అత్యంత ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి తిరిగి వస్తుండగా భద్రతా సిబ్బంది షారూక్‌ను నిలువరించారు. రూ.18 లక్షల లగ్జరీ వాచీలు షారూక్‌ ఖాన్‌ బ్యాగ్‌లో ఉండగా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆరా తీశారు. అయితే ఆ తర్వాత వాటిపై కస్టమ్ డ్యూటీ మొత్తం రూ.6.83 లక్షలను బాలీవుడ్ హీరో  చెల్లించారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాక షారూక్‌ ఖాన్ విమానాశ్రయం నుంచి పంపించివేశారు. 

అయితే షారూక్‌ను ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2011లో విదేశీ వస్తువులను తీసుకురావడంతో కస్టమ్స్ అధికారులు రూ1.5 కోట్ల జరిమానా విధించారు. ప్రస్తుతం ఎస్‌ఆర్కే స్పై యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ పఠాన్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25, 2023న విడుదల కానుంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో అతిథి పాత్రతో పాటు 'జవాన్', 'డుంకీ' కూడా కనిపించనున్నారు. దుబాయ్‌లోని షార్జాలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్- 2022లో పాల్గొన్న షారూక్ తిరిగి ముంబై చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు